Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జ్ఞాపకశక్తి పెరిగేందుకు ఇవి తింటే మేలట!

డ్రై ఫ్రూట్లలో పోషక పదార్థాలు మెండుగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆక్రోట్లు జ్ఞాపకశక్తి పెరిగేందుకు తోడ్పడతాయట. రోజూ గుప్పెడు ఆక్రోట్లు తింటే మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. ఆక్రోట్లను అధికంగా తీసుకున్న వ్యక్తులు తాము నిర్వహించిన పరీక్షలో మెరుగైన ఫలితాలు కనబర్చారని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన లెనోర్ అరబ్ అనే వైద్యుడు తెలిపారు. వీటిలో అనేక రకాల విటమిన్లు, ఖనిజలవణాలతోపాటు యాంటీఆక్సిడాంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అనే వృక్ష సంబంధ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ హృదయ, మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకారి. ఇది వార్ధక్యంలో వేధించే అల్జీమర్స్ వ్యాధిని నిరోధించడంలోనూ, తీవ్రత తగ్గించడంలోనూ తోడ్పడుతుంది.

More Telugu News